లాక్ డోన్ నేపథ్యంలో పేదలు, అనాథలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ఆకలి తీర్చేందుకు ఆపన్నులు ముందుకు వస్తున్నారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలో షిరిడీ సాయి సేవాశ్రమం ఆధ్వర్యంలో గత 20 రోజులుగా పేదలకు, వృద్ధులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు.
దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో భోజనాలు తయారు చేసి ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నంత కాలం... పేదలకు భోజనం అందిస్తామని సేవాశ్రమ ప్రతినిధులు చెప్పారు. రోజుకు 60 నుంచి 70 మంది వరకు భోజనం ప్యాకెట్లను అందజేస్తున్నామన్నారు.