గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి వినుకొండ సీతయ్యనగర్‌లో పెంకుటిల్లు కూలిపోయింది. రాజధాని గ్రామాల్లో గతరాత్రి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద వాగు పొంగిపోర్లుతోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపట్లలో కుండపోత వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా బాపట్లలోనే 157.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు నగరంలోని 3 వంతెనలు, పాతగుంటూరు శివారు ప్రాంతాలు వర్షానికి జలమయంగా మారాయి. జిల్లాలో 57 మండలాల్లోనూ వర్షం కురిసింది.
మండలాల వారీగా వర్షపాతం
బాపట్లలో అత్యధికంగా 157.2, పిట్టలవానిపాలెం 149.2, తుళ్లూరు 137.6, పెదకాకాని 135.4, కర్లపాలెం 110.2, నగరం 110.2, మంగళగిరి 103.2, చిలకలూరిపేట 101.4, కొల్లిపర 95.4, వట్టిచెరుకూరు 87.8, చెరుకుల్లి 87.6, కొల్లూరు 86.8, రొంపిచర్ల 85, గుంటూరు 83, పెదనందిపాడు 82.6, కాకుమాను 82.4, దుగ్గిరాల 76.4, ఈపూరు 75.8, నిజాంపట్నం 75.2, వేమూరు 72.4, సత్తెనపల్లి 67.4, చేబ్రోలు 66.2, వినుకొండ 64.6, రేపల్లె 64, తెనాలి 62.2, భట్టిప్రోలు 59.2, తాడేపల్లి 58.8, నాదెండ్ల 54.6, చుండూరు 53.4, తాడికొండ 52, ఫిరంగిపురం 51.4, పొన్నూరు 50.6, ప్రత్తిపాడు 50.2, నూజెండ్ల 50, నకరికల్లు 48.4, మేడికొండూరు 48.2, అమృతలూరు 46.4, మాచర్ల 45.8, నరసరావుపేట 45.4, యడ్లపాడు 45.2, కారంపూడి 42.2, అమరావతి 41.8, ముప్పాళ్ల 41.8, శావల్యాపురం 41.2, దాచేపల్లి 40.2, పెదకూరపాడు 40, గురజాల 37.6, దుర్గి 36.7, బొల్లాపల్లి 36.4, పిడుగురాళ్ల 36.4, రెంటచింతల 35.4, క్రోసూరు 33.8, అచ్చంపేట 27.6, రాజుపాలెం 25.2, మాచవరం 22.6, వెల్దుర్తి 22, బెల్లంకొండ 14.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
ఉద్ధృతంగా కొంకేరు వాగు
గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలో జోరుగా కురిసిన వర్షాలకు పిచికలపాలెం, చిన్నకంచర్ల గ్రామం మధ్య ఉన్న కొంకేరు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగు ఉద్ధృతికి సుమారు 100 నుంచి 200 ఎకరాల వరి పంట నీట మునిగినట్లు రైతులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.