సింగర్ చెరువు ఆక్రమణలు తొలగించాలి! - గుంటూరు
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే సింగర్ చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులకు గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశించారు.
gunuru_vinukonda_lake
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే సింగర్ చెరువును ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరిశీలించారు. 214 ఎకరాల్లోలో ఉన్న చెరువు భూమి కొంతమేర ఆక్రమణకు గురైందని...తక్షణమే అధికారులు సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అనంతరం వినుకొండ శివారు వెల్లటూరు రోడ్డులో షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న అర్బన్ హౌసింగ్ పనులను పరిశీలించారు.