Gunturu range DIG Trivikram varma : మాచర్ల ఘటనపై గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్‌వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. అల్లర్లకు సంబంధించి తమ వద్ద వీడియో ఫుటేజ్‌ఉందని తెలిపారు.. దాని ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు డీఐజీ వెల్లడించారు. ఎవరెవరు ఏమేం చేశారో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. గాయపడిన వారినుంచి కూడా ఫిర్యాదులు తీసుకున్నట్లు తెలిపారు. ర్యాలీ తలపెడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. మాచర్లలో సాయంత్రం 6.30 నుంచి 7.30 సమయం మధ్యలో ఘర్షణలు జరిగాయని వెల్లడించారు. రెండు పార్టీల నేతలు పరస్పరం రెచ్చగొట్టుకున్నారని ఆయన తెలిపారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని కఠినంగా శిక్షిస్తామనీ డీఐజీ హెచ్చరించారు. మాచర్లలో జరిగిన ప్రతి ఘటనపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తెదేపా కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనసమీకరణ చేసినట్లు తమకు తెలిసిందని త్రివిక్రమ్‌వర్మ తెలిపారు. ఆయా గ్రామాల నుంచి ఎందరు వచ్చారో ఆరా తీస్తున్నాట్లు డీఐజీ వెల్లడించారు. తెదేపా ర్యాలీకి సంబంధించి సున్నిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు మాకు చెప్పలేద డీఐజీ అన్నారు. మాచర్ల ఘటనలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మీడియాతో డీఐజీ త్రివిక్రమ్‌వర్మ తెలిపారు. మాచర్ల ఘటనల్లో బాధ్యులందరిపైనా చర్యలు తీసుకుంటామని మరోసారు పేర్కొన్నారు.