గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా నియోజకవర్గంలో కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు నిత్యావసర సరకులకు ఇబ్బందులు పడకుండా ఇజ్రాయిల్ పేట, మణిపురం ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి కూరగాయలను పంచిపెట్టారు.
ప్రభుత్వం కరోన నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు. ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.