ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపాకు ఓటమి భయంతోనే దాడులు చేస్తుంది' - Guntur tdp District President gv Anjaneyulu comments

దేశంలో బిహార్​ను తలదన్నే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనేవిధంగా మారిపోయిందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. నరసరావుపేట తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా నేతల తీరుపై మండిపడ్డారు.

Guntur tdp District President gv Anjaneyulu
మీడియాతో గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు

By

Published : Mar 12, 2020, 9:44 AM IST

రాష్ట్రంలో ఆరాచకపాలన నడుస్తోందన్నారు గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. వైకాపా ప్రభుత్వం ఎన్నికలంటే భాయపడుతోందని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో స్థానిక ఎన్నికల్లో తెదేపా సభ్యుల నామినేషన్లు చింపేసేస్థాయికి దిగజారిందన్నారు. మాచర్లలో కేసు పెట్టేందుకు వెళ్లిన బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావుపై వైకాపా శ్రేణులు దాడిచేయడం దుర్మార్గమన్న ఆయన మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుందన్నారు.

మీడియాతో గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు

ABOUT THE AUTHOR

...view details