గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల... ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. కొల్లూరు మండలంలోని ఆరు గ్రామాల్లో మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోతర్లంక, జువ్వలపాలెం, తిప్పలకట్ట, కృష్ణా నగర్, తురకపాలెం, తోక వారి పాలెం గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. దోమలు, ఈగలతో అవస్థలు పడుతున్నారు. కరెంటు లేక తాగునీటికీ సమస్యగా మారిందని మహిళలు వాపోతున్నారు. క్షేత్ర పరీశీలనకు వచ్చిన విద్యుత్ శాఖ తెనాలి డీఈ మురళీకృష్ణను పోతర్లంక గ్రామస్తులు నిలదీశారు. తమ సమస్య పరిష్కరించే వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం లైన్ల మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయని... త్వరలోనే విద్యుత్ ను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాలకు విద్యుత్ కష్టాలు
గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలు విద్యుత్ సదుపాయం లేక... చీకటిలోనే మగ్గుతున్నాయి. ఒక వైపు దోమలు... మరోవైపు ఈగలతో చిన్నపిల్లలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. పలు చోట్ల విద్యుత్ పనులను పునరుద్దరించని కారణంగా బోర్లపై ఆధారపడిన గ్రామాల్లో తాగు నీటి సమస్య ఏర్పడింది.
వరద ప్రభావిత ప్రాంతాలకు విద్యుత్ కష్టాలు