ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన బిల్ కలెక్టర్

లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఇంటి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో గుంటూరు జీవీఎంసీ బిల్ కలెక్టర్ భూపతి వీరరాజు 7వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

7వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన గుంటూరు జీఎంసీ బిల్ కలెక్టర్

By

Published : Aug 19, 2019, 4:39 PM IST

7వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన గుంటూరు జీఎంసీ బిల్ కలెక్టర్

మరో అవినీతి చేప అనిశా అధికారుల వలలో చిక్కింది. గుంటూరు కన్నావారితోటకు చెందిన కె.పాండవులు తన కుమారులిద్దరికీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి, ఇంటి పన్ను నిమిత్తం గుంటూరు జీవీఎంసీలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి కొలతల కోసం వచ్చిన బిల్ కలెక్టర్ భూపతి వీరరాజు 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి.. 7వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనితో పాండవులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు బిల్ కలెక్టర్ 7వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details