fake challans: మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాలు కలకలం - గుంటూరు జిల్లాలో నకిలీ చలనాలు
13:03 September 28
గుంటూరు: మంగళగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సబ్‌రిజిస్ట్రార్
రాష్ట్ర వ్యాప్తంగా నకీలీ చలానాలు వెలుగుచూసిన నేపథ్యంలో... మూడు నెలలుగా అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలలో అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో అధికారులు మూడు నకిలీ చలానాలు గుర్తించారు. 2019లో ఒకటి, 2020లో రెండు నకిలీ చలానాలు వెలుగుచూసినట్లు సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణమూర్తి గుర్తించారు. వీటిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో సబ్‌రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.
ఇదీ చదవండి