కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా గుంటూరు మిర్చి యార్డును ఈనెల 20 నుంచి 24 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. యార్డుకు ఎవరూ మిర్చి బస్తాలను తీసుకురావొద్దని కోరారు. 27 తరువాత మిర్చియార్డు తిరిగి ప్రారంభిస్తామని యార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. ఇప్పటికే మిర్చి యార్డులో పనిచేసే హమాలీలు, గుమస్తాలు, కమిషన్ ఏజెంట్లు కరోనా బారిన పడ్డారు. దీనివల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రేపటి నుంచి గుంటూరు మిర్చియార్డు మూసివేత - గుంటూరు జిల్లా మిర్చియార్డు మూసివేత
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో గుంటూరు మిర్చి యార్డును మూసివేస్తున్నట్లు యార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 24 వరకూ యార్డుకు ఎవరూ మిర్చి బస్తాలు తీసుకురావద్దని కోరారు.
guntur dst mirchi yard will be closed from tomorrow onward due to increasing positve cases