గుంటూరు జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆవిష్కరించారు. మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు 53.94 శాతం కేటాయించినట్లు పేర్కొన్నారు.
పంట రుణాలకు 12,800 కోట్ల రూపాయలు, దీర్ఘకాలిక రుణాలు 2600 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు 1000 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రుణాలకు 4900 కోట్లు, వాణిజ్య పంటల ఎగుమతులకు సంబంధించిన రుణాలకు 100 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు 2000 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 7వేల కోట్లు మొత్తంగా 30,400 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికలను ఆవిష్కరించామని చెప్పారు.