గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కాట్రపాడు వద్ద కృష్ణా నది మీదుగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కారులో 40 కేసుల మద్యం తరలిస్తుండగా సమాచారం అందుకున్నారు.
సోదాలు చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కారు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వీటి విలువ సుమారు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు ఉంటుందని గురజాల డీఎస్పి శ్రీ హరి బాబు తెలిపారు.