ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లో కూర్చోని బటన్ నొక్కే సీఎం.. తెనాలికి ఎందుకు వస్తున్నారో చెప్పాలి?: జనసేన

Guntur Janasena President sensational comments on jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో కూర్చోని పథకాలకు బటన్ నొక్కే సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తెనాలికి ఎందుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆర్భాటాలు, ప్రకటనలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని.. పర్యటనలకు, ప్రకటనలకు పెడుతున్న ఖర్చులు రోడ్లకు, పేద ప్రజలకు కేటాయిస్తే అభివృద్ధి పెరుగుతుందని హితవు పలికారు.

janasena president
janasena president

By

Published : Feb 25, 2023, 10:53 PM IST

Updated : Feb 26, 2023, 6:35 AM IST

సీఎం జగన్ తెనాలికి ఎందుకు వస్తున్నారో చెప్పాలి

Guntur Janasena President sensational comments on jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో కూర్చోని పథకాలకు బటన్ నొక్కే సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తెనాలికి ఎందుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆర్భాటాలు, ప్రకటనలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకు, ప్రకటనలకు పెడుతున్న ఖర్చులను.. రాష్ట్రంలోని రోడ్లకు, పేద ప్రజలకు కేటాయిస్తే అభివృద్ధి పెరుగుతుందని హితవు పలికారు.

గుంటూరు జిల్లా తెనాలి పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెనాలి టూర్ ప్రోగ్రాంపై జనసేన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంట్లో కూర్చోని పథకాలకు బటన్ నొక్కే ముఖ్యమంత్రి.. తెనాలి రావడం ఎందుకు? ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అని వ్యాఖ్యానించారు. పర్యటన నిమిత్తం తెనాలిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆగ్రహించారు.

అనంతరం తెనాలి పర్యటనకు విచ్చేస్తోన్న ముఖ్యమంత్రిని స్థానిక శాసన సభ్యుడు అభివృద్ధి నిధుల కోసం జగన్ మోహన్ రెడ్డిని నిలదీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందన్నారు. దీంతో జనసేన పార్టీ అన్ని జిల్లాలో ఉన్న 300 మంది కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. రానురాను రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రశ్నించిన, ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలపై ఎదురుదాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసినవాళ్లని వదిలేసి ప్రతిపక్షాల నేతలపై కేసులు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం నోరు పెదపడం లేదన్నారు. తెనాలి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతమని.. ముఖ్యమంత్రి చేస్తున్న ఆర్భాటాలు, ప్రకటనలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. పర్యటనలకు ప్రకటనలకు పెడుతున్న ఖర్చులు రాష్ట్రంలోని రోడ్లకు పేద ప్రజలకు ఇస్తే అభివృద్ధి పెరుగుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి నాలుగేళ్ల నుంచి దోచుకుంటున్న ఇసుక ఎటుపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఈ ప్రశ్నలంటికి సీఎం జగన్ వెంటనే సమాధానం చెప్పాలని అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 26, 2023, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details