గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరులో 60 మంది వైరస్ బారిన పడగా.. తాడేపల్లిలో 15, రేపల్లెలో 13, తెనాలిలో 12, అమర్తలూరులో 8 చొప్పున బాధితులు బయటపడ్డారు. మహమ్మారి ధాటికి ఒకరు మృతి చెందారు.
కరోనా మరణాల్లో రెండో స్థానంలో గుంటూరు
కొత్తగా 206 మందికి గుంటూరు జిల్లాలో కరోనా సోకింది. ఒకరు మహమ్మారితో మృతి చెందారు. గుంటూరు మండలంలో అత్యధికంగా 60 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్త కొవిడ్ మరణాలలో జిల్లా రెండో స్థానంలో ఉంది.
రెండవ స్థానంలో కొనసాగుతున్న గుంటూరు
కొత్త కేసులతో కలిపి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 70,996 మందికి కొవిడ్ సోకింది. 68,138 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. 638 మంది మరణించారు. కరోనా వల్ల రాష్ట్రంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న జిల్లాల్లో.. గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి:అధికారులు మరిచారు.. కానీ ఆ యువకుడు బాధ్యత చూపాడు!