కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లల కోసం పిడియాట్రిక్ కొవిడ్ కేర్ కేంద్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రారంభించారు. అడవితక్కెళ్లపాడులోని టిడ్కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు. వంద పడకలతో ఈ కేంద్రాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేశామని కలెక్టర్ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. పిల్లలను ఈ కొవిడ్ కేర్ కేంద్రంలో ఉంచి చికిత్స అందించనున్నట్లు చెప్పారు. అనంతరం ట్రై ఏజ్ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ, వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ జె.యాస్మిన్, డ్వామా పీడీ ఆనంద్ నాయక్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎ.వి.పటేల్, నోడల్ అధికారి జె.పి.డి.టాండన్, అధికారులు పాల్గొన్నారు.
పిడియాట్రిక్ కొవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్ వివేక్ యాదవ్
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పిల్లల కోసం పిడియాట్రిక్ కేర్ కేంద్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రారంభించారు. వంద పడకలతో ఈ కేంద్రాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.
Collector Vivek Yadav