కొవిడ్-19 పాజిటివ్ వ్యక్తులకు అనుమతులు లేకుండా చికిత్స అందిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పందించారు. రెవెన్యూ అధికారులు వారి పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని.... అనుమతులు లేకుండా కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
'అనుమతుల్లేని ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి' - గుంటూరు కొవిడ్ వార్తలు
కరోనా పాజిటివ్ రోగులకు అనుమతుల్లేకుండా వైద్యం అందిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు.

గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్