రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా పేరుగాంచిన గుంటూరు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
'ప్రశాంత వాతావరణంలో తిరునాళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి' - guntur district temple
ప్రశాంత వాతావరణంలో కోటప్పకొండ తిరునాళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు.
కోటప్పకొండ తిరునాళ్లపై సమీక్ష
తిరునాళ్లలో అవాంఛనీయ ఘటనలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమావేశం అనంతరం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామిని కలెక్టర్ వివేక్ యాదవ్ దర్శించుకున్నారు.
ఇదీచదవండి.