గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులను దశలవారీగా వారి స్వస్థలాలకు పంపించాలని అధికారులు నిర్ణయించారు. ఎయిమ్స్‌లో వలస కార్మికులు ఓ సంస్థపై దాడికి యత్నించిన నేపథ్యంలో... గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు, ఎస్పీ రామకృష్ణ వారితో సమావేశమయ్యారు. వలస కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకన్నారు. లాక్ డౌన్ వల్ల అందరికీ పని దొరకడం లేదని కార్మికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ ముందు సంపాదించిన డబ్బులతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చామని... ఇకనైనా తమను సొంత ప్రాంతాలకు తరలించాలని విన్నవించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు వారికి హామీఇచ్చారు
వలస కార్మికులతో సమావేశమైన గుంటూరు ఐజీ - guntur dig met vth migrate workers
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న వలస కార్మికులతో ఐజీ ప్రభాకర్ రావు సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
guntur DIG met migrate worker staying in mangalgiri AIMs