ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరానగర్​ వాసులకు వారం రోజుల్లో పట్టాల పంపిణీ: జిల్లా కలెక్టర్ - mla alla ramakrishna reddy

ఆత్మకూరులో 12 ఎకరాలలో జగనన్న కాలనీ పేరుతో నిర్మిస్తున్న ప్రత్యేక కాలనీ పనులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. వారం రోజుల్లో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

Jagananna Colony Model Houses
Jagananna Colony Model Houses

By

Published : Jun 13, 2021, 6:25 PM IST

ముఖ్యమంత్రి జగన్ నివాస ప్రాంతంలోని బకింగ్ హామ్ కెనాల్ పక్కనే ఉంటున్న అమరానగర్ వాసులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చెప్పారు. అమరారెడ్డి నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 283 మందికి మంగళగిరి మండలం ఆత్మకూరులో 12 ఎకరాలలో జగనన్న కాలనీ పేరుతో ప్రత్యేక కాలనీ నిర్మిస్తున్నారు. ఈ పనులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.

ఒక్కో లబ్ధిదారుడికి రెండు సెంట్లు స్థలం కేటాయించారు. కాలనీలో మౌలిక వసతులు, పాఠశాల, సామాజిక భవనాలు నిర్మించనున్నారు. వారం రోజుల్లో లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకొని అమరారెడ్డి ప్రాంతంలో ఉంటున్న వారిని ఇక్కడికి తరలిస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుడుకి లక్షా 80 వేలు ఇస్తున్నామని కలెక్టర్ తెలియజేశారు. ఇళ్లు కోల్పోతున్న వారికి సకల సౌకర్యాలను ఈ ప్రాంతంలో కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details