ప్రభుత్వం అనుమనుతులు జారీ చేసిన పట్టా భూముల్లో నిబంధనలు పాటిస్తూ… ఇసుక తవ్వకాలు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని… జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి మండలంలోని ధరిణికోట, అచ్చంపేటలో ఇసుక తవ్వకాలను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు.
ఇసుక తవ్వకాలు వేగవంతం చెయ్యండి: కలెక్టర్ - guntur latest news
ఇసుక తవ్వకాలు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతి మండలంలోని ధరిణికోట, అచ్చంపేటలో ఇసుక తవ్వకాలను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు.
ధరణికోటలోని పట్టా భూముల్లో ప్రతిరోజు 10 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు చేపట్టాలన్నారు. వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని ఇసుక యార్డుల్లో నిల్వలు పెంచేందుకు ప్రతి రోజు 15 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం అధిగమించేలా తవ్వకాలు కొనసాగించే విధంగా కాంట్రాక్టర్లు పనిచేయాలని సూచించారు. అనంతరం ముత్తాయపాలెంలోని ఇసుక స్టాక్ యార్డును పరిశీలించారు. వే బ్రిడ్జిపై లారీల కాటాల వివరాలను, ఇసుక బుకింగ్, డెలివరీకి సంబంధించి ఏపీఏండీసీ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో ప్రజలు మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలలో సంచరించడం గమనించిన జిల్లా కలెక్టర్… కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయాలంటే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా విస్తృత అవగాహన కలిగేలా ప్రచారం నిర్వహించాలని అచ్చంపేట తహసీల్దార్ ను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగేవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.