ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడిపై గుంటూరు కలెక్టర్ సమీక్ష - కరోనా కట్టడిపై గుంటూరు కలెక్టర్ సమీక్ష వార్తలు

కరోనా కట్టడిపై చర్యలు తీసుకోవాలని గంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కర్ఫ్యూ, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, పేదలందరికీ ఇళ్ల పథకం, స్పందన ఫిర్యాదులపై సమీక్షించారు.

guntur
కరోనా కట్టడిపై గుంటూరు కలెక్టర్ సమీక్ష

By

Published : May 22, 2021, 9:40 PM IST

కొవిడ్ నివారణ చర్యలతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ది పనులు వేగవంతం చేయాలని గంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొవిడ్ నివారణ చర్యలు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, పేదలందరికీ ఇళ్ల పథకం, స్పందన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

కరోనా కట్టడిపై గుంటూరు కలెక్టర్ సమీక్ష

ఉపాధి హామీ పనుల్లో ఎక్కువమంది కూలీలు పాల్గొనేలా గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. జలకళ పథకం కోసం బోర్ల దరఖాస్తులను తహసీల్దార్లు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్​నెస్ కేంద్రాల భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details