గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మానవత్వం చాటుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో మాస్కు పెట్టుకోలేదనే కారణంతో... పోలీసుల చేతిలో దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోయిన దళితుడు కిరణ్ కుటుంబ సభ్యులను శ్రీదేవి పరామర్శించారు. తన సొంత నిధుల నుంచి లక్ష రూపాయలు మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ మృతికి కారణమైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
మృతుడు కిరణ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీదేవి ఆర్ధిక సాయం - తాడికొండ శ్రీదేవి వార్తలు
ప్రకాశం జిల్లా చీరాలలో మాస్కు పెట్టుకోలేదనే కారణంతో... పోలీసుల చేతిలో దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోయిన దళితుడు కిరణ్ కుటుంబ సభ్యులను గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు.
మృతుడు కిరణ్ కుటుంబ సభ్యులకు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆర్ధిక సాయం