ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుజరాత్ యువతుల వసూళ్ల దందా.. వాహనదారులను ఆపి మరీ దబాయింపు..! - గుజరాత్ యువతుల దందా వార్తలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలో.. గుజరాత్​కు చెందిన కొందరు యువతులు రోడ్లపై వెళ్లే వాహనాలను ఆపి దందాకు పాల్పడుతున్నారు. వాహనదారులను బలవంతంగా ఆపి నగదు వసూలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

gujarat women collecting money from motorists at prathipadu in gujarat
వాహనదారుల వద్ద అక్రమంగా డబ్బుల వసూళ్లు చేస్తున్న గుజరాత్ యువతులు

By

Published : Jul 22, 2021, 6:31 AM IST

వాహనదారుల వద్ద అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్న గుజరాత్ యువతులు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీపంలో.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 8 మంది యువతులు.. వసూళ్ల దందాకు తెరతీశారు. ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయం సమీపంలో.. గుంటూరు ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను బలవంతంగా ఆపి డబ్బులు వసూళ్లు చేశారు.

ప్రతి వాహనదారుడి నుంచి.. కనీసం రు.500 ల పైబడి వసూలు చేసినట్టు.. స్థానిక ఎస్సై అశోక్​కు సమాచారం అందింది. వెంటనే సిబ్బందితో కలిసి ఎస్సై అక్కడికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. ఇలాంటి వసూళ్లు చట్ట విరుద్ధమని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

ABOUT THE AUTHOR

...view details