ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ ఉద్యోగాల భర్తీ తీరుపై అభ్యర్థిని ఆవేదన - గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ

గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ తీరుపై అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని వెల్లడించారు. 'కీ'లో 60 మార్కులు రాగా.. నిన్నటి ఫలితాల్లో 42 మార్కులు వచ్చాయని రమ్య తెలిపారు. పేద కుటుంబానికి చెందిన తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం చేయాలంటూ ఏపీపీఎస్పీ అధికారులను కోరారు.

grama-sachivalayam-jobs-mistakes

By

Published : Sep 20, 2019, 5:26 PM IST

సచివాలయ ఉద్యోగాల భర్తీ తీరుపై అభ్యర్థిని ఆవేదన

గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో తనకు అన్యాయం జరిగిందని గుంటూరుకు చెందిన రమ్య అనే అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరిటెపాడుకు చెందిన రమ్య ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగానికి.... ఈనెల 7న పరీక్ష రాసింది. ప్రభుత్వం విడుదల చేసిన కీ ప్రకారం 60కి పైగా మార్కులు వచ్చాయి. నిన్న విడుదల చేసిన ఫలితాల్లో మాత్రం తనకు 42 మార్కులే వచ్చాయని రమ్య కన్నీరుమున్నీరవుతోంది. మైనస్ మార్కులు తొలగించి కూడా చెక్ చేశానని ఆమె తెలిపారు. దీనిపై ఏపీపీఎస్పీ కార్యాలయాన్ని సంప్రదిస్తే హెల్ప్ డెస్క్లో ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారని... అయితే హెల్ప్ డెస్క్ నంబర్‌ స్విచ్​ ఆఫ్​ వస్తోందని రమ్య చెబుతోంది. ప్రశ్నాపత్రం లీకైందనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details