ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడారని ఉద్యోగం తొలగించారు! - jagan

ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన భర్తను ఉద్యోగంలో నుంచి తొలగించారని బుజ్జి అనే మహిళ ఆరోపించారు. ఈ ఘటన అమరావతి మందడంలో జరిగింది. ఉద్యోగం పోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని బాధితులు బోరుమంటున్నారు.

govt-removed-empolyee

By

Published : Jul 1, 2019, 6:52 PM IST

మీడియాలో సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆమె భర్త ఉద్యోగాన్ని తొలగించిన సంఘటన అమరావతి మందడంలో చోటు చేసుకుంది. ఇటీవల చంద్రబాబును ఆయన నివాసంలో రాజధాని రైతులు కలిశారు. సమావేశం అనంతరం మహిళలు ప్రభుత్వ విధానాలు తప్పుపట్టారు. ఆ తరువాత బుజ్జి అనే మహిళ భర్త కిరణ్ ఉద్యోగాన్ని ప్రభుత్వం తొలగించింది. మందడం విద్యుత్ సబ్ స్టేషన్ లో కిరణ్ చాలా ఏళ్ళ నుంచి కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు.అకారణంగా ఉద్యోగం తొలగించటంతో కిరణ్​ కుటుంబం రోడ్డున పడింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details