ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ-వార్డు కార్యదర్శులకే రిజిస్ట్రేషన్ అధికారాల జీవోలపై వెనక్కి - జీవోలపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం

GOVT GO BACK ON REGISTARTION POWRES : గ్రామ-వార్డు కార్యదర్శులకే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పిస్తూ ఇచ్చిన జీవోపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వం మెమో దాఖలు చేసింది.

GO WITHDRAWLS
GO WITHDRAWLS

By

Published : Nov 1, 2022, 1:22 PM IST

Updated : Nov 1, 2022, 2:15 PM IST

GO WITHDRAWLS : గ్రామ-వార్డు కార్యదర్శులకే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పిస్తూ ఇచ్చిన జీవోపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వం మెమో దాఖలు చేసింది. సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలు తీసివేయడంపై హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరగ్గా.. వార్డు కార్యదర్శులకే అధికారాలు చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ వివరించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలు తొలగించడం హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని కోర్టుకు నివేదించారు. అయితే సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలు కొనసాగుతాయని లిఖితపూర్వకంగా తెలపడంతో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సోమయాజులు ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ముగించింది.

జీవోలపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం
Last Updated : Nov 1, 2022, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details