ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్నదే వైకాపా లక్ష్యం"

SAJJALA COMMENTS : వీలైనంత త్వరగా విశాఖ నుంచే పాలన సాగిస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ఆకాంక్షన్నారు.

SAJJALA COMMENTS ON POLITICS
SAJJALA COMMENTS ON POLITICS

By

Published : Oct 21, 2022, 7:24 PM IST

SAJJALA COMMENTS ON POLITICS : వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే జగన్‌ పని చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ అభినందన సభలో పాల్గొని ప్రసంగించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. నాయకుల బిడ్డలే నాయకులు కావాలని లేదు.. వారికీ తగిన అర్హత ఉండాలని అన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. అప్పుడే వేడి మొదలైందన్నారు. మూడు రాజధానుల బిల్లు పెట్టిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో విజయం సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details