లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం పెన్షన్ల పంపిణీ తీరును ఆయన పరిశీలించారు. రేషన్ సరకుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన వారందరికీ నిత్యావసర వస్తువులు అందజేస్తామని హామీ ఇచ్చారు.
పేదలకు నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పలువురు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
గుంటూరులో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గిరిధర్