ఆసుపత్రికి చికిత్సకు వచ్చేవారంతా మీకింద పని చేసేవాళ్లనే భావన ఉంటే తొలగించుకోవాల్సిందిగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ హితవు పలికారు. హెచ్‌డీఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆస్పత్రిలో ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులు, నర్సుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. రోగులను చులకన భావంతో చూస్తున్నారనే ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌తో పాటు వైద్యులందరిపై ఉందన్నారు. క్యాథ్‌ల్యాబ్ నిర్వహణ గురించి చర్చకు రాగా నిబంధనల ప్రకారం పని చేయాల్సిందేనన్నారు. కొవిడ్ బాధితులకు సత్వర చికిత్స అందేవిధంగా పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జేసీ ప్రశాంతి, సూపరింటెండెంట్ ప్రభావతి, డీఎంహెచ్‌వో యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.
గుత్తేదారులకు నోటీసులు
సర్వజనాసుపత్రిలో నిలిచిపోయిన నిర్మాణ పనులకు సంబంధించిన గుత్తేదారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదే సమయంలో వారికి రావాల్సిన బకాయిల విషయం గురించి సంబంధిత అధికారులతో చర్చిస్తానన్నారు. మార్చురీ విస్తరణ పనులు పూర్తి చేయాలన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం పనులు ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. క్యాన్సర్ వార్డులో అవసరమైన ఉద్యోగులను ఒప్పంద విధానంలో నియమించాలన్నారు.
రూ.8 లక్షలతో ఏం చేద్దాం?
హెచ్‌డీఎస్ ఖాతాలో రూ.8 లక్షలు నిల్వ ఉంటే ఆ నిధులతో ఏమీ చేయలేమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వివిధ విభాగాలకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా సూచించారు. ఇప్పటికే మంజూరైన పరికరాలు త్వరగా వచ్చేవిధంగా చూడాలని సూచించారు. గైనిక్ విభాగానికి అవసరమైన వెంటిలేటర్‌ను కొవిడ్ నిధుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు.
పీపీపీ విధానంలో గుండె శస్త్రచికిత్సలు