ప్రచార తార వంగవీటి రాధాతో కలిసి ఎంపీ జయదేవ్ ఎన్నికల ప్రచారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో తెలుగుదేశం ప్రచార తార వంగవీటి రాధాతో కలిసి ఎంపీ జయదేవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.లోకేష్, గల్లా జయదేవ్లను గెలిపించాలని రాధా ఓటర్లను అభ్యర్థించారు.జగన్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారనివంగవీటి రాధా విమర్శించారు. జగన్‌కు బుద్ధి వచ్చేలా ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. ప్రధాని మోదీపై పోరాడి జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ గల్లా స్పష్టం చేశారు. చౌకీదార్ అంటూ చోరులను వదిలేస్తున్నారని విమర్శించారు. జగన్ హైదరాబాద్లోకాకుండా అమరావతికి వచ్చి రాజకీయాలుచేయాలని డిమాండ్ చేశారు.