ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా అబ్బాయి గెలవాలి.. తెదేపా అధికారంలోకి రావాలి'

రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అవుతారని.. తమ కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా కచ్చితంగా గెలుస్తాడనీ.. జయదేవ్ మాతృముూర్తి గల్లా అరుణకుమారి విశ్వాసం వ్యక్తం చేశారు.

గల్లా అరుణకుమారి

By

Published : May 21, 2019, 1:22 PM IST

గల్లా అరుణకుమారి

రాష్ట్రంలో తిరిగి తెదేపానే అధికారంలోకి వస్తుందని.. ఎగ్జిట్ పోల్స్​ను నమ్మనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో గంగమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకున్న ఆమె.. గంగమ్మ తల్లి తమ ఇలవేల్పు అని.. ఇక్కడ గుడి ఉందని తెలుసుకుని దర్శనం కోసం వచ్చానన్నారు. తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంతా బూటకమని.. తమ అబ్బాయి జయదేవ్ మళ్లీ ఎంపీగా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆమె వెంట కోడలు పద్మావతి ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details