తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలి పదవికి సీనియర్ నాయకురాలు గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. ఈ మేరకు... లేఖను ఆమె అధినేత చంద్రబాబుకు పంపారు. త్వరలో పార్టీ నూతన రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటవుతున్నందున పూర్తి నిర్ణయాధికారం అధినేతకే వదిలేస్తూ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా గల్లా పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ రాజీనామా - telugu desam party latest news
తెదేపా సీనియర్ నాయకురాలు గల్లా అరుణకుమారి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఈ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
Galla Aruna kumari
తొలుత కాంగ్రెస్‌లో ఉన్న గల్లా అరుణకుమారి.. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికలకు ముందు తెదేపాలో చేరిన ఆమె.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018లో ఆమెను పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా చంద్రబాబు నియమించారు. గల్లా అరుణకుమారి తనయుడు జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నుంచి విజయం సాధించారు.