Job Cheating: హైకోర్టులో క్లర్క్ ఉద్యోగాల పేరుతో నకిలీ కాల్ లెటర్స్ చూపించి ప్రజలను మోసం చేస్తున్న కేసులో మరో నలుగురు వ్యక్తులను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కందుకూరి కమల్, పాలేటి సత్యవరప్రసాద్, దాసి జయబాబు, ముప్పిడి జాన్లుగా గుర్తించారు. నకిలీ కాల్ లెటర్స్ చూపించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సీఐ దుర్గాప్రసాద్ చెప్పారు. హైకోర్టు ఉప సెక్షన్ అధికారి ప్రసాదరావు ఫిర్యాదు మేరకు ఈ కేసుపై విచారణ చేపట్టామన్నారు. ఈ కేసులో గతంలోనూ పలువురు వ్యక్తులను అరెస్టు చేశామని.. వారిచ్చిన సమాచారంతో వీళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు
Job Cheating: హైకోర్టులో ఉద్యోగాలంటూ మోసం.. కేసులో మరో నలుగురు అరెస్టు - guntur district latest news
Job Cheating: హైకోర్టులో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూల్ చేస్తున్న కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
Job Cheating
ఇదీ చదవండి : Job Cheating: హైకోర్టులో ఉద్యోగాలంటూ మోసం.. ముగ్గురు అరెస్టు