ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

440వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు - అమరావతి రైతుల ఆందోళన

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు చెేపట్టిన ఆందోళన 440వ రోజూ కొనసాగింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అబ్బరాజుపాలెం, కృష్ణాయపాలెం గ్రామంలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.

ఆందోళనలో పాల్గొన్న మహిళలు
ఆందోళనలో పాల్గొన్న మహిళలు

By

Published : Mar 1, 2021, 8:33 PM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు ఆందోళనలు 440వ రోజూ కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అబ్బరాజుపాలెం, పెదపరిమి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ మందడం సాయిబాబు ఆలయంలో మహిళలు పూజలు చేసి నిరసన తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ నిరాహార దీక్షకు దిగిన పెదపరిమి మహిళలు, రైతులకు స్థానిక నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ఇదీ చదవండి:

తెనాలిలో జోరందుకున్న పురపాలక ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details