యాసిడ్ దాడి బాధితుడికి మాజీ మంత్రి పరామర్శ - Nakka Anand Babu talked to the acid attack victim in guntur
గుంటూరు జిల్లా భట్టిప్రోలులో శ్రీనివాసరావు అనే వ్యాపారిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. బీజేపీ నేత అంబికా కృష్ణతో కలసి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాధితుడిని ఆయన పరామర్శించారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితులను పట్టుకోకుండా పోలీసుల అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
యాసిడ్ దాడి బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు , బీజేపీ నేత అంబికా కృష్ణ