రాజధాని రైతుల దీక్షలకు మద్దతుగా ఐకాస ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన రిలే నిరాహార దీక్షలను సందర్శించిన ఆయన రైతులకు సంఘీభావం తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళల మాటలు సమాజాన్ని కదిలిస్తున్నాయన్నారు. రోజుల తరబడి ఉద్యమిస్తున్నా... రాజధాని కోసం పదుల సంఖ్యలో ప్రజలు మరణించినా ఈ ముఖ్యమంత్రి కనీసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించకపోవటం దారుణమన్నారు.
'పోలవరంపై చెప్పిన మాటలన్ని తప్పని ఒప్పుకోండి' - Polavaram Latest News
పోలవరంలో అసలు పునాదులే వేయలేదని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి... వచ్చే సంవత్సరంలో నీళ్లు వస్తాయని ఎలా చెప్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. పోలవరంపై చెప్పిన మాటలన్ని తప్పని ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఐకాస ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రాజధాని రైతులు చేపట్టిన దీక్షలను సందర్శించిన ఆయన రైతులకు సంఘీభావం తెలిపారు.
రాజధాని రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమా
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అసలు పునాదులే వేయలేదని చెప్పిన సీఎం జగన్... వచ్చే ఏడాదిలో నీళ్లు వస్తాయని ఎలా అంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. రాజకీయం కోసమే ఇదంతా చెప్పినట్లు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరంపై చెప్పిన మాటలన్ని తప్పని సీఎం చెప్పాలన్నారు.