ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KUMBLE: 'స్పోర్ట్స్​ యూనివర్శిటీ పెడితే సహకరిస్తాను' - గుంటూరు తాజా వార్తలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను, ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్పోర్ట్స్​ యూనివర్శిటీ పెడితే సహకారిస్తానని కుంబ్లే తెలిపారు.

Former Indian Test cricket captain Anil Kumble
ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే

By

Published : Jul 5, 2021, 6:07 PM IST

ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి అనిల్ కుంబ్లే వెళ్లారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్పోర్ట్స్​ యూనివర్శిటీ పెడితే సహకారిస్తానని కుంబ్లే తెలిపారు.

క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీపై దృష్టిసారించాలని సీఎంను కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం జలంధర్, మీరట్‌ లాంటి నగరాలనుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటామన్న వెల్లడించారు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని సీఎంకు వివరించారు. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాట్లు కుంబ్లే తెలిపారు.

సీఎంను కలిసిన అనిల్‌ కుంబ్లే


ఇదీ చదవండీ..ready made house: చిటికెలో ఇల్లు తయార్​.. ఎటైనా తీసుకెళ్లేలా అద్భుత సౌకర్యం!

ABOUT THE AUTHOR

...view details