ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నడూ లేని అరాచకాలు మహేష్ రెడ్డి గెలిచాక జరిగాయి: యరపతినేని - Guntur Latest News

MLA Yarapatineni: మాచర్ల ఘటనలపై పల్నాడు ప్రాంత వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గురజాల ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి గెలిచాక నియోజకవర్గంలో 8మంది అమ్మాయిలు మరణించారని, 10మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు నాయకులు మృతి చెందారని ఆరోపించారు.

MLA Yarapatineni
ఎన్నడూ లేని అరాచకాలు మహేష్ రెడ్డి గెలిచాక జరిగాయి: యరపతినేని

By

Published : Dec 19, 2022, 2:26 PM IST

ఎన్నడూ లేని అరాచకాలు మహేష్ రెడ్డి గెలిచాక జరిగాయి: యరపతినేని

MLA Yarapatineni: మాచర్ల ఘటనల అనంతరం పల్నాడు ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గురజాల ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి గెలిచాక నియోజకవర్గంలో ఆయన కూతురు వయసున్న 8మంది అమ్మాయిలు చనిపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 10మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు నాయకులు చనిపోయింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వడ్డెర కాలనీ యువకుడు నీలకంఠబాబుని కత్తులతో పొడిచి పేగులు బయటకు లాగి చంపారని, ఫ్లెక్సీలు చించారని జానపాడులో ముగ్గురు ముస్లిం మైనార్టీ పిల్లల్ని తెచ్చే స్టేషన్లో పడేశారని, తుమ్మలపాడు సైదాను అల్లా అల్లా అని అరుస్తున్నా వదలకుండా కొట్టారని ఆరోపించారు.

టీడీపీ హయాంలో ఒక్క వైసీపీ కార్యకర్త అయినా హత్య చేయబడ్డారా చెప్పాలన్నారు. మాచర్లలో జూలకంటి తల్లిదండ్రులు నాగిరెడ్డి, దుర్గాంబ ఎన్నో పదవులు చేపట్టారని.. ఇప్పుడు బ్రహ్మారెడ్డి సామాన్య ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. కానీ పిన్నెల్లి సోదరులు అధికారం అండగా రెచ్చిపోతున్నారని.. మాచర్ల ఘటనలు వారితో పాటు రాష్ట్రంలో వైసీపీ పతనానికి నాంది పలికాయని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఇష్టారాజ్యంగా బరితెగిస్తే ప్రజలు తిరగబడతారని రుజువైందని అభిప్రాయపడ్డారు. అధికారం పోతే మీ పరిస్థితి ఏంటో ఓసారి ఆలోచించాలని హెచ్ఛరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details