ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Flexi issue: పల్నాడు జిల్లాలో ఫ్లెక్సీల వివాదం..! - పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఫ్లెక్సీల వివాదం

Flexi issue: పల్నాడు జిల్లా నరసరావుపేటలో.. తెదేపా, వైకాపా మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో.. పల్నాడు రోడ్డులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాల వద్ద వైకాపా కార్యకర్తలు.. సీఎంకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని తెదేపా శ్రేణులు తొలగించడంతో..వైకాపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఫ్లెక్సీలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసులకు సూచించారు.

Flexi issue raised between tdp and ysrcp
పల్నాడు జిల్లాలో ఫ్లెక్సీల వివాదం

By

Published : Apr 7, 2022, 10:33 AM IST

పల్నాడు జిల్లాలో ఫ్లెక్సీల వివాదం

Flexi issue: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. పట్ఠణంలో సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో.. పల్నాడు రోడ్డులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాల వద్ద వైకాపా కార్యకర్తలు.. సీఎంకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కళాశాల.. తెదేపా నియోజకవర్గ బాధ్యుడు అరవిందబాబు సోదురుడికి చెందినది. దీంతో అరవిందబాబు..ఫ్లెక్సీలను తొలగించాల్సిందిగా వైకాపా శ్రేణులను కోరారు. అందుకు వారు నిరాకరించడంతో.. ఆయన వెంట ఉన్న కొందరు తెదేపా శ్రేణులు ఫ్లెక్సీని తొలగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైకాపా నాయకులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న స్థానిక వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. ఫ్లెక్సీ తొలగింపును తప్పు పట్టారు. తాము కళాశాల నిర్వాహకుల అనుమతి తీసుకునే ఫ్లెక్సీని ఏర్పాటు చేశామని.. అలాంటప్పుడు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details