గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం మయూరి కాటన్ మిల్లులో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. గోదాముల్లోని వేస్ట్ కాటన్ బేళ్ళు నిల్వ ఉంచిన చోట.. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలను అదుపు చేస్తున్నారు.
రాత్రి వేళ ఇబ్బంది లేకుండా ఆస్కా లైట్ ను ఉపయోగించి మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మయూరి కాటన్ మిల్స్ యాజమాన్యం అందుబాటులో లేదు. ప్రమాదం ఎలా జరిగింది, ఎంత నష్టం వాటిల్లిందనే వివరాలు అనేది ఇంకా తెలియదని అగ్నిమాపక అధికారి చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారని వెల్లడించారు.