Fire Crackers: గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ప్రజలు దీపావళి పండగను పెద్దగా జరుపుకోలేదు. ఈ సంవత్సరమైన ఘనంగా జరుపుకోవాలి అనుకునే ప్రజలకు బాణసంచా ధరలు.. పంటి కింద రాయిలాగా మారాయి. దీపావళి పండగ అంటే బాణసంచా సాధరణం. గత రెండు సంవత్సరాలుగా పండగ లేకపోవటంతో టపాకాయల క్రయవిక్రయాలు జరగలేదు. ఈ సంవత్సరమైనా వ్యాపారం బాగుటుందని ఆశించిన వ్యాపారులకు.. నిరాశే ఎదురైంది. గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. సరదాగా జరుపుకుందామనుకున్న పండుగ వేళ టపాకాయల ధరలు కొండెక్కడంతో.. బాణసంచా కొనలేకపోతున్నమని ప్రజలు అంటున్నారు.
కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలకు వచ్చిన ప్రజలు.. పెరిగిన ధరలను చూసి హడలెత్తుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా పండగను జరుపుకోలేకపోయామని, ఈ సంవత్సరం జరుపుకుందమనుకుంటే ధరలు వీపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగటం వల్ల బాణసంచా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రభుత్వం బాణాసంచా ధరలపై నియంత్రణ చర్యలు తీసుకోకపోవటం వలనే.. వ్యాపారులు ఇష్టంవచ్చిన ధరలకు అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు.