ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో రెండుచోట్ల అగ్నిప్రమాదాలు... రూ.70 వేల మేర ఆస్తినష్టం - నందివెలుగు వద్ద ఆయిల్ ట్యాంకర్​లో మంటలు

రెండు వేర్వేరు అగ్నిప్రమాదాల్లో.. దాదాపు రూ. 70 వేల మేర ఆస్తినష్టం సంభవించింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ ఘటనలు జరిగాయి. నందివెలుగు వద్ద ఆయిల్ ట్యాంకర్​లో మంటలు చెలరేగి రూ. 50 వేలు, కంచర్లపాలెంలో వరిగడ్డి వాము దగ్ధమై రూ. 20 వేలు నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధరించారు.

fire accidents in tenali, sudden fire accident in oil tanker near nandivelugu
తెనాలిలో రెండుచోట్ల అగ్నిప్రమాదాలు, నందివెలుగు సమీపంలో ఆయిల్ ట్యాంకర్​ చెలరేగిన మంటలు

By

Published : Apr 2, 2021, 11:04 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. నందివెలుగులోని సబ్బుల తయారీ కర్మాగారానికి ఆయిల్ తీసుకెళ్తున్న ట్యాంకర్​లో.. సంగంజాగర్లమూడి-నందివెలుగు మధ్య ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినట్లు స్టేషన్ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. సుమారు రూ. 50 వేల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కంచర్లపాలెంలో దాదాపు రెండు ఎకరాల వరిగడ్డి వాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే తెనాలి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు రూ. 20 వేల నష్టం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారి ప్రాథమికంగా తేల్చారు.

ABOUT THE AUTHOR

...view details