BUDGET: 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరించే ప్రక్రియను మొదలు పెట్టింది. ఆమేరకు సచివాలయంలోని 5వ బ్లాక్లో వివిధ శాఖల అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించింది. సంక్షేమం, అభివృద్ధికి ఎంత మేర కేటాయింపులు చేయాలనే దానిపై వివరాలు కోరింది. ప్రస్తుతం నిధుల లేమి, రెవెన్యూలో తగ్గుదల తదితర అంశాల కారణంగా బడ్జెట్ రూపకల్పన క్లిష్టంగా మారింది.
2023-24 బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ కసరత్తు.. ఆయా శాఖల నుంచి ప్రతిపాదనల స్వీకరణ - ap budget
2023 AND 2024 BUDGET: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ఆదాయ ఆర్జన శాఖల లక్ష్యాల పై ఈసారి ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అయా శాఖల అధికారులు సమర్పించారు.
2022 - 23 ఆర్థిక సంవత్సరానికి 2లక్షల 56వేల 256 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వచ్చే బడ్జెట్ ఆమొత్తం కంటే 5 నుంచి 10 శాతం మేర పెరుగుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 2లక్షల 75 వేల కోట్ల రూపాయల వరకూ బడ్జెట్ అంచనాలు ఉండొచ్చని సమాచారం. నవరత్నాల పథకాల అమలుతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఏ మేరకు నిధులు అవసరం అన్న అంచనాలను ఆర్థిక శాఖ స్వీకరించనుంది. శాఖల వారీగా మరో దఫా భేటీకానున్న ఆర్థిక శాఖ వివరంగా ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా ఉన్నతాధికారులను కోరింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అంచనాలను రూపొందించుకోవాలని ఇప్పటికే సూచించింది.
ఇవీ చదవండి: