గుంటూరు జిల్లాలో ఓ మహిళా వాలంటీర్ బలవన్మరణానికి పాల్పడింది. చుండూరు మండలం దుండిపాలెం గ్రామానికి చెందిన బాంధవి వాలంటీర్‌గా పని చేస్తోంది. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె ఆత్మహత్యకు మరో వాలంటీర్ శ్రీనివాస్ కారణమని మృతురాలి తండ్రి ఆరోపించారు. మృతురాలి బంధువులు శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులకి అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మహిళా వాలంటీర్ ఆత్మహత్య...! - గుంటూరులో వాలంటీర్ ఆత్మహత్య వార్తలు
ఏమైందో ఏమో తెలియదు కానీ గుంటూరు జిల్లాలో... ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి మాత్రం మరో వాలంటీరే తన కుమార్తె ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తున్నారు.
Female volunteer suicide at Dundipalem in krishna district