Farmers Suffering Due to Lack of Irrigation Water for Crops:కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న వర్షాభావంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. పట్టిసీమ, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజిని నింపి అరకొరగా కాలువలకు విడుదల చేస్తున్నారు. అయితే అందిస్తున్న నీరు ఆయకట్టుకి సరిపోవడం లేదు. గుంటూరు జిల్లాలో 60వేల హెక్టార్లు, బాపట్ల జిల్లాలో లక్షా 9వేల ఎకరాలు వరి పంట సాగు చేశారు. వరి పంట 25రోజుల నుంచి 40రోజుల దశలోనే ఉంది. నీరు లేక పంటలు ఎండిపోతుంటే గుండె తరుక్కు పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోటార్ల సాయంతో మురుగు కాలువల్లో ఉన్న నీటితో పొలాలను తడుపుతున్నారు. సాగునీటి కాలువలకు పూర్తిస్థాయిలో నీరు రాకపోతే మురుగుకాల్వలోనూ నీటి లభ్యత తగ్గిపోతుంది. పంట వంద రోజుల దశకు వచ్చినప్పుడు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో నీరు అందకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు వాపోతున్నారు.
Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు
Current Water Wells in Pulichintala Project:పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 20.88 టీఎంసీలు నీటినిల్వలు ఉన్నాయి. ఇక్కడి నుంచి 3వేల క్యూసెక్కుల చొప్పున ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 7వేల క్యూసెక్కులు తోడి పోస్తుండగా ప్రకాశం బ్యారేజీకి చేరేసరికి 5500 క్యూసెక్కులు వస్తున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువకు 3700 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో సింహభాగం వెద పద్ధతిలో వరి పంట సాగు చేయడంతో అందరికీ ఒకేసారి సాగునీరు అవసరమవుతోంది. దీనికితోడు ఎండలు 38 డిగ్రీల వరకు ఉండటంతో నీటి అవసరాలు పెరిగాయి. డెల్టా ప్రధాన కాలువకు 3700 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తుండటంతో బ్రాంచ్ కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు.