అమరావతి నినాదాన్ని రైతులు తమ దైనందిన కార్యక్రమాలతో పాటు పండుగలు, వివాహ వేడుకల్లోనూ భాగం చేశారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని 'జై అమరావతి' అంటూ నినాదాలు చేస్తూ ఆలయాలకు ర్యాలీగా వెళ్లారు. ఆది దంపతుల విగ్రహాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రైతులు నిరసనలు చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఎర్రబాలెం శివాలయంలో మహిళలు ప్రత్యేక అభిషేకాలు చేశారు. తాడేపల్లి మండలం పెనుమాకలోనూ మహిళలు, రైతులు జై అమరావతి, శంభోశంకర అంటూ నినాదాలు చేసి.. ఆందోళనలో పాల్గొన్నారు.
ఆలయాల్లోనూ 'జై అమరావతి' నినాదాలే
అమరావతి సెగ ఆలయాలకు తాకింది. రాజధానిని తరలించవద్దంటూ అమరావతి పరిసర ప్రాంతాల్లోని రైతులు ఆలయాలకు నినాదాలు చేసుకుంటూ వచ్చారు. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
'జై అమరావతి' అంటూ నినాదాలు