పురుగు మందు డబ్బాలతో ఎర్రబాలెం రైతుల ధర్నా
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు పురుగు మందుల డబ్బాలతో ధర్నా నిర్వహించారు. రాజధాని భూముల్లో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో రైతులు వెంటనే అప్రమత్తమయ్యారు. 'సీఆర్డీఏ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. తాము రాజధాని అభివృద్ధి కోసం భూములు ఇచ్చామని, పేదల ఇళ్ల స్థలాల కోసం కాదని వాపోయారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తాము ఇచ్చిన భూముల్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
పురుగు మందు డబ్బాలతో ఎర్రబాలెం రైతుల ధర్నా