ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 23, 2020, 4:29 PM IST

ETV Bharat / state

పేదోడి భూమి లాక్కొని.. పేదలకు ఇవ్వడమేంటి..?

పేదలమైన తమకు ఇచ్చిన భూమిని లాక్కొని పేదలకు ఇవ్వడమేంటనీ.. డోకిపర్రు గ్రామానికి చెందిన రైతు కోర్టును ఆశ్రయించాడు. పంట పండించుకుంటున్న భూమిలో రెవెన్యూ అధికారులు మట్టి తోలడంపై స్పందనలో ఫిర్యాదు చేశారు. అక్కడా తనకు న్యాయం జరగలేనందునా తన భూమి తనకు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

farmers protest against to revenue officers behavior
తమ భూమిని లాక్కొంటురని ఫిర్యాదు చేసిన రామకోటయ్య కుటుంబం

తమ భూమిని లాక్కొంటురని ఫిర్యాదు చేసిన రామకోటయ్య కుటుంబం

తమ పంట భూమిలో అనుమతి లేకుండా రెవెన్యూ అధికారులు మట్టి తోలరని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రామకోటయ్య అనే వ్యక్తికి గతంలో గ్రామంలోని భూమికి ప్రభుత్వం డీకే పట్టా మంజూరు చేసింది. అప్పటి నుంచి రామకోటయ్య కుటుంబం అదే భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం పేదలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు రామకోటయ్యకు మంజూరు చేసిన భూమిలోకి రెవెన్యూ అధికారులు మట్టిని తోలారు. తనకు న్యాయం చేయాలని బాధితులు గుంటూరు స్పందనలో ఫిర్యాదు చేశారు. అక్కడ వారికి న్యాయం జరగనందునా కోర్టును ఆశ్రయించారు. పేదలకు ఇచ్చిన భూమిని మరలా పేదలకు ఇవ్వటం ఏంటని బాధితులు ప్రశ్నించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details