దిగుబడి బాగా వచ్చిందనీ.. లాభాలు వస్తాయని ఆశించిన సొరకాయ పంట రైతులకు.. కన్నీళ్లే మిగిలాయి.మార్కెట్‌లో సొరకాయ ఒక్కటి రూ.10 నుంచి రూ.15 పలుకుతోంది. రైతు దగ్గర దళారులు రూ.2కు కూడా కొనడం లేదు. రాజధాని అమరావతి పరిధిలోని మందడం, తాళ్ళాయపాలెం, రాయపూడి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా సొర పంటను వేశారు. దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక, అటు కూలీలతో కోయించలేక కొందరు రైతులు రోడ్లపై, మరికొందరు పొలంలోనే వదిలేశారు.
పండించిన చేతుల్తోనే పారేశారు
ఎన్ని ప్రభుత్వాలు మారినా.. రైతుల తలరాతలు మారటం లేదు. రైతు కొనేటప్పుడు ఆకాశన్నంటే ధర... అన్నదాత అమ్మాలని చూస్తే... ధర నేల చూపులు చూస్తుంది. దీంతో పంటను పొలంలోనే వదిలేస్తున్నారు.. మరి కొంతమంది రైతులు ఎంతో కొంత ధర వస్తుందని.. ఆశపడి పంటను కోత కోసినా.. గిట్టుబాటు ధర లేక.. పంటను రోడ్లపైనే వేసేస్తున్నారు.
పంటను రోడ్డు మీద వదిలేసిన రైతులు