ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు కౌలురైతు మృతి.. - farmer died with thunderbolt

పిడుగుపాటుకు గురై కౌలు రైతు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా గొట్టిపాళ్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిద్దయ్య పొలం పనులు చేస్తుండగా..పిడుగుపాటుకు గురై ప్రాణాలు విడిచారు.

పిడుగుపాటుకు కౌలు రైతు మృతి
పిడుగుపాటుకు కౌలు రైతు మృతి

By

Published : Oct 30, 2021, 8:45 PM IST

గుంటూరు జిల్లా గొట్టిపాళ్లలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఓ కౌలు రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన రావుల సిద్దయ్య(33) రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేస్తున్నాడు. పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా కురిసిన వర్షంలో పిడుగుపడడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details